తుపాకీతో అత్తను కాల్చి చంపిన అల్లుడు | son in law gun with kills aunt | Sakshi
Sakshi News home page

తుపాకీతో అత్తను కాల్చి చంపిన అల్లుడు

Oct 13 2014 3:17 AM | Updated on Sep 2 2018 4:37 PM

ఓ అల్లుడు నాటు తుపాకీతో అత్తను కాల్చి చంపాడు. ఇదే ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు.

ఒకరికి తీవ్ర, మరొకరికి స్వల్పగాయాలు
బేస్తవారిపేట : ఓ అల్లుడు నాటు తుపాకీతో అత్తను కాల్చి చంపాడు. ఇదే ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని పోగుళ్లలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దొర తిరుమలమ్మ(55)కు పెద్దమల్లు అల్లూరయ్య అల్లుడు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలేరమ్మ కొలుపులు నిర్వహిస్తున్నారు. అల్లూరయ్య పూటుగా మద్యం తాగాడు. మేకలు మేపుకునే విషయంలో తిరుమలమ్మ కొడుకులు, అల్లునికి గొడవ జరిగింది. గొడవ పెద్దదవుతుండటంతో అల్లూరయ్యను భార్య తిరుపతమ్మ ఇంట్లో పెట్టి తలుపేసింది.

ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో తడికె తలుపు నుంచి అల్లూరయ్య బయటకు కాల్చాడు. ఇంటి బయట ఉన్న తిరుమలమ్మ పొట్టలో బుల్లెట్ దిగిబడి బయటకు వచ్చింది. ఆమె పక్కనున్న మనుమడు కళ్యాణ్‌కు తీవ్ర గాయాలుకాగా గ్రామస్తుడు నాగూర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రక్తమోడుతున్న తిరుమలమ్మను వైద్యశాలకు తరలించేందుకు రోడ్డుపైకి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మిగిలిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement