బాటిల్లో చిక్కి.. పడగవిప్పి

Snake Stuck in Plastic Water Bottle Dwaraka Tirumala - Sakshi

కొద్దిసేపు తాచుపాము పిల్ల హల్‌చల్‌  

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ తూర్పు ప్రాంతంలోని జంటగోపురాల వద్ద శుక్రవారం ఉదయం తాచుపాము పిల్ల కొద్దిసేపు హల్‌చల్‌ చేసింది. అక్కడ పడి ఉన్న ఒక వాటర్‌ బాటిల్‌లోకి దూరిన ఆ పాము పిల్ల బయటకొచ్చేందుకు అష్టకష్టాలు పడుతూ.. పడగ విప్పి చూడటం మొదలు పెట్టింది. అంత చిన్న పాము పిల్ల పడగ విప్పి చూస్తుండటాన్ని అక్కడున్న భక్తులంతా ఆసక్తిగా తిలకించారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక హోంగార్డు ధైర్యం చేసి ఆ బాటిల్‌కు మూతపెట్టి, పాము పిల్లను బందీ చేశాడు. అనంతరం కొండపైకి దూరంగా తీసుకెళ్లి పొదల్లో విడిచిపెట్టాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top