
టెక్కలి రూరల్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ టెక్కలి ఏరియా ఆస్పత్రిలో గురువారం ఒక పాము హల్‌చల్ చేసింది. ఆస్పత్రిలోని ట్రామా వార్డులో రోగులు కిక్కిరిసి ఉన్న సమయంలో పాము కనిపించడంతో అంతా భయంతో బయటకు ఉరుకులు పరుగులు తీశారు.
వార్డులోని మరుగుదొడ్డికి వెళుతూ ఇది కనిపించడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు పాముని హతమార్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వార్డుల్లోని రోగులు మాట్లాడుతూ మరుగుదొడ్డిలో లైట్లు, తలుపులు లేవని వివరించారు. దీని వల్లే పాములు వస్తున్నాయని వాపోయారు.