పుష్కర తొక్కిసలాటలో దోషులెవరో తేల్చాలని ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు ఈ ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ను కోరారు.
ఏకసభ్య కమిషన్‌ను కోరిన ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు
రాజమహేంద్రవరం క్రైం: పుష్కర తొక్కిసలాటలో దోషులెవరో తేల్చాలని ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు ఈ ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ను కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏకసభ్య కమిషన్ జస్టిస్ సోమయాజులు నాలుగోసారి బహిరంగ విచారణ చేపట్టారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తమ వాదనలు వినిపిస్తూ పుష్కర తొక్కిసలాట జరిగి ఏడాది కావస్తున్నా ఇందుకు బాధ్యులెవరో తెలియలేదని, ఈ ఘటనపై ఏ ఒక్క అధికారికీ కనీసం మెమో కూడా ఇవ్వలేదన్నారు. ఇంతటి ఘోరానికి కారకులు ఎవరనేది తెలియాలని డిమాండ్ చేశారు. 14వ తేదీనాటికి విచారణను వాయిదా వేస్తున్నామని జస్టిస్ సోమయాజులు పేర్కొన్నారు.
కమిషన్ సమావేశం ముగిసిన అనంతరం జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తొక్కిసలాటకు ప్రధాన కారణం చంద్రబాబు పుష్కర ఘాట్‌లో 2 గంటలపాటు పూజలు చేయడమేనని విమర్శించారు.