పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ వీరంగం | SI Drink Alcohol With Friends in Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ వీరంగం

May 11 2018 8:12 PM | Updated on Mar 22 2019 6:16 PM

SI Drink Alcohol With Friends in Police Station - Sakshi

పోలీస్‌ స్టేషన్‌లో మందు పార్టీ ఇస్తున్న ఎస్‌ఐ రవికుమార్‌

సాక్షి, గుంటూరు: పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ వీరంగం సృష్టించారు. ఏకంగా స్టేషన్‌లోనే తన మిత్రులకు మందు పార్టీ ఇచ్చారు. ఈ ఘటన బాపట్ల ఎక్సైస్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. రవికుమార్‌ అనే వ్యక్తి బాపట్లలో ఎక్సైజ్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శక్రవారం తన స్నేహితులకు స్టేషన్‌లోనే మందుపార్టీ ఇచ్చారు. దీనిని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్‌ను ఎస్‌ఐ అడ్డుకున్నారు. రిపోర్టర్‌ దగ్గర ఉన్న కెమెరాను లాక్కుని విజువల్స్‌ డిలీట్‌ చేశారు. రిపోర్టర్‌పై స్నేహితులకు చిన్న పార్టీ కూడా ఇవ్వటం నేరమా అంటూ ఎస్‌ఐ రవికుమార్‌ మండిపడ్డారు. 

వైఎస్సార్‌: జిల్లాలోని కమలాపురంలో మరో ఎస్‌ఐ వీరంగం సృష్టించారు. దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వేంపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిపై పూణే వాసులు దాడి చేశారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అక్కడ కమలాపురం ఎస్సై రఫీ బాధితుడి రోదన వినకుండా సర్ది చెప్పి పంపారు.  బాధితుడు బయటకు రాగానే పూణే వాసులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. దీన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించిన సాక్షి విలేఖరిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement