అటు ఫైరింగ్ ... ఇటు షూటింగ్ | Shruti Haasan was shooting 30 km away when Seshachalam encounter took place on Tuesday! | Sakshi
Sakshi News home page

అటు ఫైరింగ్ ... ఇటు షూటింగ్

Apr 9 2015 11:29 AM | Updated on Oct 2 2018 3:08 PM

అటు ఫైరింగ్ ... ఇటు షూటింగ్ - Sakshi

అటు ఫైరింగ్ ... ఇటు షూటింగ్

పోలీసుల ఎన్కౌంటర్ చేశారంటేనే హడల్. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎవరైనా దగ్గరలో ఉంటే వారి గుండె ఆగినంత పని అవుతుంది

చిత్తూరు: పోలీసుల ఎన్కౌంటర్ చేశారంటేనే హడల్. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎవరైనా దగ్గరలో ఉంటే వారి గుండె ఆగినంత పని అవుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది హీరోయిన్ శృతిహాసన్కి. మంగళవారం శేషాచల పర్వత ప్రాంతంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు. అదే సమయంలో ఆ ప్రదేశానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో పులి చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఆ చిత్ర హీరోహీరోయిన్లు విజయ్, శృతిహాసన్లు ఆ షూటింగ్లో పాల్గొన్నారు.

సాయంత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత వారు తిరుగు ప్రయాణంలో తిరుపతి వస్తుండగా తలకొన చెక్పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మరం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్కౌంటర్ జరిగిన విషయం చిత్ర యూనిట్కు తెలిసింది.   కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ అనేసరికి శృతి హాసన్ అవాక్కయినట్లు సమాచారం.  మరోవైపు తిరుపతి పరిసర ప్రాంతాల్లో పులి చిత్ర షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో శ్రీదేవి, హాన్సిక, సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement