
సాక్షి, చిత్తూరు: తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం చేటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ కొరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే భారీగా మంటలు వ్యాప్తించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మరో రెండు రోజుల్లో కౌంటింగ్ జరుగునున్న విషయం తెలిసిందే. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.