వేండ్ర గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో ఒక గృహం దగ్ధమవడంతో రూ.లక్షకు పైగా ఆస్తినష్టం సంభవించింది. సానుబోయిన మధు రేకుల ఇంటిలో నివసిస్తున్నారు.
పాలకోడేరు : వేండ్ర గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో ఒక గృహం దగ్ధమవడంతో రూ.లక్షకు పైగా ఆస్తినష్టం సంభవించింది. సానుబోయిన మధు రేకుల ఇంటిలో నివసిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నామని మధు తెలిపారు. ఇంట్లో గృహోపకరణాలు, గ్యాస్ సిలిండర్లు, బట్టలు అన్ని దగ్ధయ్యాయని ఆయన బోరున విలపిస్తున్నాడు. వీఆర్‌వో రాజు వచ్చి ఆస్తినష్టాన్ని ధ్రువీకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జి. రత్నమణి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉప సర్పంచ్ భూపతి రాజు చంటి రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి బియ్యం, తదితర సామగ్రిని బాధిత కుటుంబానికి అందజేశారు.