సింహగిరిపై శుక్రవారం తెల్లవారుజామున వ్యాపార దుకాణాల సముదాయంలో 10 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. ...
10 దుకాణాలు దగ్ధం
షార్టు సర్క్యూటే కారణం
రూ.85 లక్షల వరకు నష్టం
బాధితుల ఆర్తనాదాలు
సింహాచలం: సింహగిరిపై శుక్రవారం తెల్లవారుజామున వ్యాపార దుకాణాల సముదాయంలో 10 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని దేవస్థానం అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 3.30 నుంచి 4 గంటల సమయంలో ఆలయంలో విధులకు కొండదిగువ నుంచి సింహగిరికి వె ళ్లిన కొంతమంది వైదికులు వ్యాపార దుకాణాల సముదాయంలో మంటలు, పొగ రావడాన్ని గమనించి దేవస్థానం అధికారులు, వ్యాపారులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సింహగిరికి చేరుకున్నారు.
అప్పటికే 10 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడాన్ని చూసి దుకాణాల యజమానులు నిర్ఘాంతపోయారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా 10 దుకాణాల్లోని వస్తువులు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. మంటలు వ్యాపార సముదాయంలో ఉన్న ఇతర దుకాణాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. రంగంలోకి దిగిన నార్త్ ఏసీపీ భీమారావు, గోపాలపట్నం సీఐ బాలసూర్యారావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. దేవస్థానం ఏఈఓలు ఆర్.వి.ఎస్.ప్రసాద్, ఇజిరోతు సత్యనారాయణ ఆస్తి నష్టాన్ని అంచనా వేసే పనులు చేపట్టారు. సుమారు రూ.60 లక్షలు
దుకాణాల యజమానులకు,రూ. 20 లక్షలు దేవస్థానానికి నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.