'సోనియా రహస్య పుత్రుడు చంద్రబాబు' | Shobha Nagi Reddy takes on cm Kiran kumar reddy, Chandrababu | Sakshi
Sakshi News home page

'సోనియా రహస్య పుత్రుడు చంద్రబాబు'

Nov 22 2013 1:58 PM | Updated on Jul 29 2019 5:31 PM

'సోనియా రహస్య పుత్రుడు చంద్రబాబు' - Sakshi

'సోనియా రహస్య పుత్రుడు చంద్రబాబు'

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు చెలగాటమాడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు చెలగాటమాడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి ఆరోపించారు.శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభానాగిరెడ్డి మాట్లాడుతూ... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కిరణ్, చంద్రబాబులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

 

రాష్ట్రవిభజన విషయంలో చంద్రబాబు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రహస్య పుత్రునిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను విమర్శించే ముందు తమ విధానాన్ని ఏంటో తెలియజేయాలని శోభానాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ సీనియర్ నేత, శాసన మండలిలో ఆ పార్టీ నేత యనమల రామకృష్ణకు జగన్ ఫోబియా పట్టుకుందని ఆమె పేర్కొన్నారు.

 

నీకు ధైర్యముంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమైక్యమని చెప్పించగలవా అని యనమలను డిమాండ్ చేశారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖరావం యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించగానే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ కుప్పం వస్తే మీకెందుకంత భయం అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. విభజన నిర్ణయం వచ్చిన రోజు సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని శోభానాగిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement