మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి | sexual assault on mental handicaps | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి

Feb 25 2015 12:10 PM | Updated on Oct 9 2018 7:05 PM

కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో ఓ మానసిక వికలాంగురాలిపై వావి వరుసలు మరిచిన కామాంధుడొకడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

కృష్ణా: కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో ఓ మానసిక వికలాంగురాలిపై వావి వరుసలు మరిచిన కామాంధుడొకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వావిలాల గ్రామంలో జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఆమె మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వరుసకు బాబాయి అయిన హుస్సేన్ అనే వ్యక్తి లైంగికదాడికి ఒడిగట్టాడు.

భాదితురాలు తల్లిదండ్రులకు చెప్పటంతో వారు బుధవారం ఉదయ తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
(తిరువూరు)

Advertisement
 
Advertisement
Advertisement