సుమో బీభత్సం: ఏడుగురికి గాయాలు | Seven injured in kanipakam due to sumo car driver rash driving | Sakshi
Sakshi News home page

సుమో బీభత్సం: ఏడుగురికి గాయాలు

Aug 10 2014 10:51 AM | Updated on Sep 2 2017 11:41 AM

శ్రీవరసిద్ధి వినాయకుడు కొలువైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం సుమో వాహనం బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్ : శ్రీవరసిద్ధి వినాయకుడు కొలువైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం సుమో వాహనం బీభత్సం సృష్టించింది. ఆ వాహనం డ్రైవర్ తప్ప తాగి రోడ్డుపై అతివేగంతో కారు నడిపాడు. దాంతో ఏడుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక భక్తులు వెంటనే స్పందించి డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు సుమోను సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాణిపాకంలోని ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement