సీమాంధ్ర, తెలంగాణ అభివృద్ధికి తానా నిధులు | Seemandhra, Telangana Thana funds for the development | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర, తెలంగాణ అభివృద్ధికి తానా నిధులు

Jun 1 2014 2:07 AM | Updated on Sep 2 2017 8:08 AM

సీమాంధ్ర, తెలంగాణ అభివృద్ధికి తానా నిధులు

సీమాంధ్ర, తెలంగాణ అభివృద్ధికి తానా నిధులు

అమెరికాలో తెలుగువారి సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)...ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర కొత్తరాజధాని ఏర్పాటు, తెలంగాణ అభివృద్ధికోసం విడివిడిగా నిధులను సేకరించనుంది.

వాషింగ్టన్: అమెరికాలో తెలుగువారి సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)...ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర కొత్తరాజధాని ఏర్పాటు, తెలంగాణ అభివృద్ధికోసం విడివిడిగా నిధులను సేకరించనుంది. రెండురాష్ట్రాల అభివృద్ధికోసం తమవంతు తోడ్పాటు అందించడానికి తానాకు చెందిన పలువురు సభ్యులు ముందుకు రావడంతో వారి కోరికమేరకు తానా కార్యవర్గ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సభ్యుల నుంచి సేకరించిన నిధులను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తామని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని శుక్రవారం వెల్లడించారు. ఈ నిధులను ఏయే ప్రాజెక్టుల కోసం వినియోగించాలన్న అంశంపై తానా బోర్డు సభ్యుడు జయరాం కోమటి, కార్యదర్శి సతీష్ వేమన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement