సీఎం కిరణ్ తో సీమాంధ్ర మంత్రుల భేటీ | seemandhra congress leaders meet kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ తో సీమాంధ్ర మంత్రుల భేటీ

Dec 16 2013 8:39 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు సమావేశమైయ్యారు.

హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు సమావేశమైయ్యారు. ఈ భేటీకి 20 మంది మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ హాజరైయ్యారు. రాష్ట్ర విభజన బిల్లు సంబంధించి కీలక చర్చ అసెంబ్లీ జరిగే నేపథ్యంలో సీఎం కిరణ్ మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. విభజన బిల్లుపై సోమవారం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.

 

ఈ భేటీకి హాజరైన సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల్లో టీజీ వెంకటేశ్‌, కొండ్రుమురళి, పితాని సత్యనారాయణ, మహిధర్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వట్టి వసంతకుమార్‌, గాదె వెంకటరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ,తోట నర్సంహ, విప్‌ రుద్రరాజు పద్మరాజు, శత్రుచర్ల,అహ్మదుల్లా, శ్రీరామచంద్రయ్య, రఘువీరారెడ్డి, గాదె శ్రీనివాసులు, గల్లా అరుణకుమారి, బాలరాజు, గంటా శ్రీనివాస్‌, ఆనం రాంనారాయణ, ఆనం వివేకానంద రెడ్డి, శ్రీరామచంద్రయ్యలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement