కర్ణాటక జల దోపిడీని అడ్డుకోండి | See prevent the exploitation of water in Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటక జల దోపిడీని అడ్డుకోండి

May 26 2015 3:25 AM | Updated on Sep 3 2017 2:40 AM

సాక్షి, కర్నూలు: కర్ణాటక జల దోపిడీని తక్షణమే కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లాలని, రాజకీయాలను పక్కనపెట్టి రెం డు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం, రైతంగానికి మేలు జరిగేలా ముఖ్యమంత్రులిద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.

సాక్షి, కర్నూలు: కర్ణాటక జల దోపిడీని తక్షణమే కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లాలని, రాజకీయాలను పక్కనపెట్టి రెం డు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం, రైతంగానికి మేలు జరిగేలా ముఖ్యమంత్రులిద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కర్నూలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పూడికతో టీబీ డ్యాం సామర్థ్యం తగ్గింది. దీనికితోడు చుట్టూ 62 ఎత్తిపోత పథకాల ద్వారా 15 టీఎంసీ నీటిని చోరీ చేస్తున్నారు.
 
 వాటికి ఆ ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ సౌకర్యం కల్పించింది. సింగటలూరు ప్రాజెక్టువల్ల మరో 40 టీఎంసీల దోపిడీ జరుగుతోంది. ఇక పరిశ్రమలకు 3.5 టీఎంసీలు వాడుకుంటున్నామంటూ ఏకం గా 15 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నా రు. ఇవి కాకుండా తాజాగా భద్రపైన 30 టీఎంసీలు, తుంగపైన 30 టీఎంసీల చొ ప్పున 60 టీఎంసీల నీటి వినియోగంతో రెండు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
 
 ఇందుకోసం ఆసియా అభివృ ద్ధి బ్యాంకునుంచి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇవి పూర్తయితే మనకొచ్చే 130 టీఎంసీల నీటిని తన్నుకుపోవడంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కు.. ప్రధానంగా రాయలసీమకు తీరని నష్టం జరుగుతంది.’ అని బెరైడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రా ష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా ఈ గండం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాల న్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement