
సాక్షి, విజయవాడ: కమిషనరేట్ పరిధిలో గన్నవరం ఎయిర్‌పోర్టు ఏరియాలో శుక్రవారం నుంచి నవంబర్ 18వ తేదీ వరకు 55 రోజుల పాటు 144వ సెక్షన్ అమలులో ఉంటోందని నగర పోలీసు కమిషనర్ సి.హెచ్.ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్టు ఏరియాలో 250 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం గుమిగూడరాదని, కర్రలు రాళ్లు వంటి వాటిని పట్టుకుని తిరగరాదని ఆయన పేర్కొన్నారు.