సమ్మె కొనసాగిద్దాం: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు | Secretariat seemandhra employees to continue strike | Sakshi
Sakshi News home page

సమ్మె కొనసాగిద్దాం: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు

Oct 11 2013 12:48 AM | Updated on Sep 1 2017 11:31 PM

సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించాలని తీర్మానించుకున్నారు.

సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించాలని తీర్మానించుకున్నారు. రాష్ట్రం సమైక్యంగానే కొనసాగుతుందని సీఎం నుంచి స్పష్టమైన హామీ రానందున సమ్మె విరమించరాదని నిర్ణయించారు.

బుధవారం సీఎంతో భేటీలో పాల్గొన్న సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలన్న ఆయన సూచనలపై గురువారం సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులందరూ పాల్గొన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో తాము కూడా వారి బాటలోనే నడవాలని  నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement