లాంచీలోనే చిక్కుకుపోయారా?

Search Operation For Trace Missing Persons in Boat Accident - Sakshi

సాక్షి, దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో గోదావరిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బోటు (లాంచీ) 315 అడుగుల లోతులో మునిగిపోయినట్టుగా ఎన్డీఆర్‌ఎఫ్ గుర్తించింది. లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహం ఉధృతంగా ఉండటంతో లాంచీని వెలికితీసేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఎన్డీఆర్‌ఎఫ్ వెల్లడించింది. గల్లంతైన వారిలో చాలా మంది లాంచీలో చిక్కుకుపోయి ఉండే అవకాశముందని ఎన్డీఆర్‌ఎఫ్ భావిస్తోంది. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌తో ఓఎన్‌జీసీ చాప్టర్‌ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లు గాలింపు జరుపుతున్నారు.

నల్గొండ యువ ఇంజినీర్లు గల్లంతు
లాంచీ ప్రమాదంలో నల్గొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఇద్దరు యువ ఇంజినీర్లు గల్లంతయ్యారు. అనుముల మండలం హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్, రామడుగు గ్రామానికి చెందిన పాశం తరుణ్ రెడ్డి గల్లంతయ్యారు. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు స్నేహితులు కలిసి విహారాయాత్రకు వెళ్లారు. వీరిలో నలుగురు బయటపడ్డారు. ముగ్గురు గల్లంతయ్యారు. ముగ్గురిలో హేమంత్ అనే యువకుడిది వరంగల్ జిల్లా. విహారాయాత్రకు వెళ్లిన ఈ ఏడుగురు ఇంజినీర్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా  హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. తమ పిల్లలు బోట్ ప్రమాదంలో చిక్కుకున్నారనే వార్త తెలియగానే హాలియా, రామడుగులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన బిడ్డ ప్రాణాలతో తిరిగి రావాలని తల్లులు తల్లడిల్లిపోతున్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు రాజమండ్రి బయలుదేరారు.

సంబంధిత కథనాలు..

గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం

మేమైతే బతికాం గానీ..

తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి..

నిండు గోదారిలో మృత్యు ఘోష

అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top