వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు | SCR to run special trains in several routes | Sakshi
Sakshi News home page

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Dec 2 2017 3:25 AM | Updated on Dec 2 2017 4:27 AM

SCR to run special trains in several routes - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

 
కాచిగూడ– కాకినాడ పోర్ట్‌ రైలు (07425) డిసెంబర్‌ 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00కు కాకినాడ పోర్ట్‌ చేరుకుంటుంది.
కాకినాడ పోర్ట్‌ – కాచిగూడ రైలు (07426) డిసెంబర్‌ 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 5.50కు కాకినాడ పోర్ట్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కు కాచిగూడ చేరుకుంటుంది.
కాచిగూడ–కృష్ణరాజపురం రైలు (07603) డిసెంబర్‌ 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 6.00కు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00 గంటలకు కృష్ణరాజపురం చేరుకుంటుంది.
కృష్ణరాజపు రం–కాచిగూడ రైలు (07604) డిసెంబర్‌ 11, 18, 25, జనవరి 1,8,15,22,29, ఫిబ్రవరి 5,12,19,26 తేదీల్లో మధ్యాహ్నాం 3.25కు కృష్ణరాజపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు కాచిగూడ చేరుకుంటుంది.
కాచిగూడ–విశాఖపట్నం రైలు (07016) డిసెంబర్‌ 12,19,26 తేదీల్లో సాయం త్రం 6.45కు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కు విశాఖ చేరుకుంటుంది.
విశాఖపట్నం–తిరుపతి రైలు (07488) డిసెంబర్‌ 13,20,27 తేదీల్లో రాత్రి 7.05కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి–కాచిగూడ రైలు (07146) డిసెంబర్‌ 14,21,28 తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 5.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement