వేసవి సందర్భంగా సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.
ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పాఠశాలలను నిర్వహించనున్నారు.ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఈ నెల 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పరీక్షలు రాసిన తర్వాత విద్యార్థులను పాఠశాలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.