ఆకట్టుకున్న కల్పవృక్షిణి ప్రసంగం

School Student Speech in Amma Vodi Scheme Programme Chittoor - Sakshi

చిత్తూరు: ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రారంభం సందర్భంగా పీసీఆర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కల్పవృక్షిణి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఎటువంటి బెరుకు లేకుండా అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడి అందరి మన్నలు పొందింది. వేదికపై ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ చిన్నారి ప్రసంగానికి ముగ్దులయ్యారు. ప్రసంగం ముగిసిన తర్వాత కల్పవృక్షిణిని ప్రత్యేకంగా అభినందించారు. (చదవండి: అమ్మఒడి.. విద్యా విప్లవానికి నాంది)

‘ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా నాడు ‘నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..’ అన్నారు. అందుకే ప్రజలంతా రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. అంటున్నారు. ఇవాళ మా మేలు కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా మా అమ్మకు రూ.15 వేలు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి మా బతుకులు మార్చబోతున్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు. ఐఏఎస్‌ అధికారిణి కావడమే నా లక్ష్యం. ఆ దిశగా ఈ కార్యక్రమాలు, పథకాలు నాకెంతో మేలు చేస్తాయని భావిస్తున్నా. అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపుతున్న సీఎం జగన్‌కు మనసారా ధన్యవాదాలు’ అంటూ కల్పవృక్షిణి ఇంగ్లిష్‌లో ప్రసంగించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top