చిలక్కొట్టుడు | School for young children at home | Sakshi
Sakshi News home page

చిలక్కొట్టుడు

Dec 7 2014 3:07 AM | Updated on Sep 3 2019 9:06 PM

ఇంట్లో చిన్న పిల్లాడు స్కూల్‌కు వెళుతూ చాక్లెట్ కొనుక్కోవడానికి రూపారుు ఇవ్వు అంటే చూసిచూసి ఇస్తాం..

కడప ఎడ్యుకేషన్: ఇంట్లో చిన్న పిల్లాడు స్కూల్‌కు  వెళుతూ చాక్లెట్ కొనుక్కోవడానికి రూపారుు ఇవ్వు అంటే చూసిచూసి ఇస్తాం..   పిల్లోడికి రుపాయి ఇచ్చే విషయంలో నిక్కచ్చిగా  ఉన్నా పెట్రోల్ బంకుల్లో జరిగే దోపిడీని మాత్రం ప్రశ్నించం.  రూ. 100కు  పెట్రోల్ పట్టమంటే  రూ. 99.40కు  పట్టి మిషన్‌ను ఆపేస్తున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో  రెండు పాయింట్లు తక్కువ పడతారు. ఇక్కడ కూడా చూసీ చూడనట్లే ఉంటాం.  ప్రశ్నించకపోవడానికి కారణం  పెద్దరికం తగ్గుతుందేమోననే భావన . ఇలాంటి సంఘటనలు చాలామందికి ఎక్కడో ఓచోట నిత్యం ఎదురవుతూనే ఉంటాయి.
 
  ఇటువంటి మోసాలతో  జిల్లా వ్యాప్తంగా రూ. లక్షల్లో దోపిడీ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా పలు కంపెనీలకు చెందిన  పెట్రోల్ బంకులు వందకు పైగానే ఉన్నాయి.   అన్ని బంకుల్లో కలిసి  రోజుకు దాదాపు లక్షాయాభై వేల లీటర్ల పెట్రోల్‌ను విక్రరుుస్తుంటారు. ఇందులో కనీసం రూ. 50 వేల వరకు  పెట్రోల్ బంకుల్లో దోపిడీ జరుగుతోంది.  దీంతోపాటు రూ. 99. 50కు పెట్రోల్ పట్టినప్పుడు మిషన్‌లో ఆటోమేటిక్‌గా కొంతైనా పెట్రోల్ మిగిలే అవకాశం ఉంటుంది. ఇలా నిత్యం ప్రజలను మోసం చేస్తున్నా సంబంధితశాఖ  అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  ఈ మోసాలకు తోడు  జిల్లాలో  అనేక చోట్ల పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు.  కల్తీ పెట్రోల్‌ను వాడటం వలన వేలకు వేలు  పెట్టి కొన్న వాహనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
 
 మిషన్లలో కూడా:
 పెట్రోల్ పట్టే మిషన్లలో కూడా అడ్జెస్ట్‌మెంట్ చేసే వీలు ఉన్నట్లు తెలుస్తోంది.  కొన్ని సార్లు లీటరు పెట్రోల్‌ను పట్టించుకుంటే  తక్కువగానే  వస్తుంది. దీని గురించి అధికారులు స్పందించాలి
 - మురళీకృష్ణ,  ఫ్యాన్సీస్టోర్, కడప
 
 మైలేజ్ తగ్గుతోఎంది:
 కడపలోని  కొన్ని బంకుల్లో పెట్రోల్ పట్టించుకుంటే కనీస మైలేజీ కూడా రావటం లేదు, ఇటీవల  ఊరికి వెళుతూ   రెండు లీటర్ల పెట్రోల్ పట్టించుకున్నా.  60 కిలో మీటర్లు పోగానే బండి ఆగిపోయింది.  పెట్రోల్ తక్కువ పట్టాడో లేక కల్తీ చేశాడో అర్థం కాలేదు.   నాలాగే ఎంతో మంది నిత్యం మోసపోతున్నారు.
 - నాగేశ్వరరావు. కడప.
 పట్టించుకునే వారేరీ
 పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. పెట్రోల్ తక్కువగా పట్టడంతో పాటు నాణ్యత లేని పెట్రోల్‌ను అంటకడుతున్నారు.
 -జమాల్‌బాష,  
 స్మార్ట్  కెమెరా మెకానిక్, కడప.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement