breaking news
chololate
-
విషాదం, లాడ్జ్‌లో చాక్లెట్ తిని కుప్పకూలిపోయింది
బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల వర్ష ఒక లాడ్జ్‌లో అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం రేపింది. అదీ చాక్లెట్ తిన్న తర్వాత కుప్పకూలిపోవడంతో మరింత ఆందోళనకు గురిచేసింది. అదీ బర్త్‌డే రోజు నాడే అందని తీరాలకు చేరడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హసన్ పోలీస్ సూపరింటెండెంట్ సమాచారం ప్రకారం బెంగళూరు నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాసన్‌కు తన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 11న తన కజిన్స్, స్నేహితురాలితో కలిసి విహారయాత్ర కోసం సకలేష్‌పూర్‌లోని లాడ్జ్‌కు వచ్చింది. అక్కడ స్నానానికి వెళ్లేముందు చాక్లెట్ తిన్నది. తరువాత బాత్రూమ్కు నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!వర్ష టూర్ గురించి ఆమె తల్లిదండ్రులకు తెలుసని, ఆమె శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని అధికారులు తెలిపారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి, మరణానికి కారణం తెలుసుకోవడానికి వర్ష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. వర్ష మరణం ఆకస్మిక ఆరోగ్య సమస్య వల్ల జరిగిందా లేక మరేదైనా అంతర్లీన కారణం ఉందా అనే విషయాలను నిర్ధారించేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. వర్షతో పాటు లాడ్జ్‌లో ఉన్న ఆమె బంధువును, స్నేహితురాలిని పోలీసులు ప్రశ్నించారు. ఇదీ చదవండి: ‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతం -
చిలక్కొట్టుడు
కడప ఎడ్యుకేషన్: ఇంట్లో చిన్న పిల్లాడు స్కూల్‌కు వెళుతూ చాక్లెట్ కొనుక్కోవడానికి రూపారుు ఇవ్వు అంటే చూసిచూసి ఇస్తాం.. పిల్లోడికి రుపాయి ఇచ్చే విషయంలో నిక్కచ్చిగా ఉన్నా పెట్రోల్ బంకుల్లో జరిగే దోపిడీని మాత్రం ప్రశ్నించం. రూ. 100కు పెట్రోల్ పట్టమంటే రూ. 99.40కు పట్టి మిషన్‌ను ఆపేస్తున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో రెండు పాయింట్లు తక్కువ పడతారు. ఇక్కడ కూడా చూసీ చూడనట్లే ఉంటాం. ప్రశ్నించకపోవడానికి కారణం పెద్దరికం తగ్గుతుందేమోననే భావన . ఇలాంటి సంఘటనలు చాలామందికి ఎక్కడో ఓచోట నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. ఇటువంటి మోసాలతో జిల్లా వ్యాప్తంగా రూ. లక్షల్లో దోపిడీ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా పలు కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులు వందకు పైగానే ఉన్నాయి. అన్ని బంకుల్లో కలిసి రోజుకు దాదాపు లక్షాయాభై వేల లీటర్ల పెట్రోల్‌ను విక్రరుుస్తుంటారు. ఇందులో కనీసం రూ. 50 వేల వరకు పెట్రోల్ బంకుల్లో దోపిడీ జరుగుతోంది. దీంతోపాటు రూ. 99. 50కు పెట్రోల్ పట్టినప్పుడు మిషన్‌లో ఆటోమేటిక్‌గా కొంతైనా పెట్రోల్ మిగిలే అవకాశం ఉంటుంది. ఇలా నిత్యం ప్రజలను మోసం చేస్తున్నా సంబంధితశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ మోసాలకు తోడు జిల్లాలో అనేక చోట్ల పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. కల్తీ పెట్రోల్‌ను వాడటం వలన వేలకు వేలు పెట్టి కొన్న వాహనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మిషన్లలో కూడా: పెట్రోల్ పట్టే మిషన్లలో కూడా అడ్జెస్ట్మెంట్ చేసే వీలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సార్లు లీటరు పెట్రోల్‌ను పట్టించుకుంటే తక్కువగానే వస్తుంది. దీని గురించి అధికారులు స్పందించాలి - మురళీకృష్ణ, ఫ్యాన్సీస్టోర్, కడప మైలేజ్ తగ్గుతోఎంది: కడపలోని కొన్ని బంకుల్లో పెట్రోల్ పట్టించుకుంటే కనీస మైలేజీ కూడా రావటం లేదు, ఇటీవల ఊరికి వెళుతూ రెండు లీటర్ల పెట్రోల్ పట్టించుకున్నా. 60 కిలో మీటర్లు పోగానే బండి ఆగిపోయింది. పెట్రోల్ తక్కువ పట్టాడో లేక కల్తీ చేశాడో అర్థం కాలేదు. నాలాగే ఎంతో మంది నిత్యం మోసపోతున్నారు. - నాగేశ్వరరావు. కడప. పట్టించుకునే వారేరీ పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. పెట్రోల్ తక్కువగా పట్టడంతో పాటు నాణ్యత లేని పెట్రోల్‌ను అంటకడుతున్నారు. -జమాల్‌బాష, స్మార్ట్ కెమెరా మెకానిక్, కడప.


