ఏపీలో సర్వశిక్షా అభియాన్ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.
అమరావతి: సర్వశిక్షా అభియాన్(ఎస్.ఎస్.ఏ) ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంచుతున్నట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయా కేటగిరీల ప్రకారం ఉద్యోగుల వేతనాల పెంపు ఉంటుందని చెప్పారు.
పెరిగిన వేతనాలను వెంటనే అమలులోకి తేవాలని ఉన్నతాధికారులకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంపై భారం వున్నా.. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జీతాలు పెంచామని మంత్రి గంటా స్పష్టం చేశారు.