శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు.
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. 12న ఉదయం నుంచి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు విశేషపూజలు, వాహన సేవలు, గ్రామోత్సవం ఉంటాయన్నారు. 15న మకర సంక్రమణం రోజున వాహన సేవ, పార్వతీపరమేశ్వర కల్యాణం ఉంటుందని తెలిపారు. 16న మృగయాగోత్సవం, 17న ఉత్సవమూర్తులకు రుద్రయాగం, పూర్ణాహుతి, ధ్వజారోహణ, 18న స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత కల్యాణోత్సవం, రుద్రహోమం, గణపతి హోమం సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.