ఇసుక మాఫియా ఘాతుకం! | sand mafia attempt to murder | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియా ఘాతుకం!

Sep 1 2014 5:17 PM | Updated on Aug 28 2018 8:41 PM

విజయనగరం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దులేకుండా పోతోంది.

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. పూసపాటి రేగ మండలం కోనయ్యపాలెం గ్రామంలో ఘాతుకానికి పాల్పడ్డారు. అక్రమ ఇసుక రవాణాని అడ్డుకున్న ఆర్ఐపై హత్యాయత్నం చేశారు. ఆర్ఐ మురళీ కృష్ణని ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు.

ఆర్ఐ తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు పారిపోయారు. ఆర్ఐని చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది నెలలుగా రెవెన్యూ సిబ్బంది ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. దాంతో వారు ఏకంగా ఆర్ఐపై హత్యాయత్నమే చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement