జిల్లా వాసులు శుక్రవారం సమైక్యగళం వినిపించారు. రాష్ర్టపతి నుంచి వర్తమానాన్ని కేంద్రం పంపిన తీరుకు నిరసనగా రాష్ర్ట బంద్ నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లాలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది.
విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి నుంచి వచ్చిన వర్తమానాన్ని రాష్ట్రానికి కేంద్రం పంపిన తీరుకు నిరసనగా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. వైఎస్‌ఆర్ సీపీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ బంద్‌లో వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బ్యాంకులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. డిపోల నుంచి బస్సులు కదలకుండా ఎక్కడికక్కడ వైఎస్‌ఆర్ సీపీ నేతలు అడ్డుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు.
బొబ్బిలి, న్యూస్‌లైన్
జిల్లా వాసులు శుక్రవారం సమైక్యగళం వినిపించారు. రాష్ర్టపతి నుంచి వర్తమానాన్ని కేంద్రం పంపిన తీరుకు నిరసనగా రాష్ర్ట బంద్ నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లాలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. సాలూరు నియోజకవర్గ కేంద్రంలో తాజాగా వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద బైఠాయించి ఉదయం నుంచి బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి బోసు బొమ్మ వద్దకు చేరుకొని అక్కడ బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలచి పోయాయి. ఒడిశాకు రాకపోకలు స్తంభించాయి. పార్టీ కార్యనిర్వహక మండలి సభ్యుడు గరుడబిల్లి ప్రశాంత్, రాయల సుందరరావు, గొర్లె మధు, జర్జాపు ఈశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం నియెజకవర్గ కేంద్రం లో సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను శుక్రవారం ఉదయాన్నే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని డిపోల నుంచి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి ఏపీ ఎన్జీఓ సంఘ నాయకుడు గంజి లక్ష్ముంనాయుడు తదితరులు సంఘీభావం తెలిపారు.
ఎన్జీఓల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను మూయించి వేశారు. కురుపాం నియోజకవర్గంలో బంద్‌ను విజయవంతంగా నడిపారు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జంక్షనులో నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. గరుగుబిల్లి మండలంలో పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ, కురుపాంలో మండలంలో ఆరిక సింహాచలం, కొమరాడలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు మూసివేయించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి అవనాపు విజయ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, బ్యాంకులు మూసివేయించారు. నిరసన కార్యక్రమాల్లో మహి ళా కన్వీనరు గండికోట శాంతి, మజ్జి త్రినాథ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌కోట నియెజకవర్గంలో సమన్వయకర్తలు బోకం శ్రీనివాస్, వేచలపు చినరామినాయుడు, డాక్టరు గేదెల తిరుప తి ఆధ్వర్యంలో ర్యాలీలు,మానవహారం నిర్వహించారు.
రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు దమయంతి, కోళ్ల గంగాభవాని పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం వద్ద పార్టీ నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో దుకాణాలను మూయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నా రు. గజపతినగరం నియోజకవర్గంలో సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంపావతి నదీ దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వదరకూ ర్యాలీ జరిగింది. అలాగే పెద్దినాయుడు, మక్కువ శ్రీథర్ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షను వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. చీపురుపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్తలు వరహాలనాయుడు, సిమ్మినాయుడుల ఆధ్వర్యం లో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూయించివేశారు. ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. గరివిడి మండల కేంద్రంలో వాకాడ గోపి, శ్రీనుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బొబ్బిలి నియెజకవర్గంలోని తెర్లాం మం డల కేంద్రంలోపార్టీ నాయకుడు నర్సుపల్లి వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.
దేశం పార్టీ ఆధ్వర్యంలో...
రాష్ట్ర విభజనను నిరసిస్తూ చీపురుపల్లి, సాలూరు, పార్వతీపు రం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమా లు చేపట్టింది. సాలూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి జాతీయ రహదారి వరకూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. చీపురుపల్లిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి త్రిమూర్తుల రాజు ఆధ్వర్యంలో, పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిరంజీవులు, నాయకు డు వెంకటనాయుడులు నిరసనలు తెలిపారు. ఎస్‌కోట నియోజకవర్గం జామిలో మండల పార్టీ నాయకులు నిరసన తెలి పారు. బొబ్బిలిలో ఎన్జీఓ నాయకులు చందాన మహందాతనాయుడు, సురేష్‌పట్నాయక్‌ల ఆధ్వర్యంలో బంద్ జరిగింది.