నేటి నుంచి ‘సాక్షి–విదర్భ’ ఆటో షో | Sakhi Auto show In east Godavari | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘సాక్షి–విదర్భ’ ఆటో షో

Mar 12 2018 12:31 PM | Updated on Mar 9 2019 4:28 PM

కాకినాడ: ‘సాక్షి’ దినపత్రిక, పద్మపూజిత–విదర్భ ఆటో ఫైనాన్స్‌ సంయుక్తంగా మూడు రోజులపాటు కాకినాడలో ఆటోషో నిర్వహించనున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడ సినిమారోడ్డులోని ఆనందభారతి గ్రౌండ్స్‌లో ఈ నెల 14 వరకు  మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త, పాత వాహనాల కొనుగోలు, అమ్మకాలతోపాటు తక్షణ ఫైనాన్స్‌ సదుపాయాన్ని కల్పించనున్నారు. ప్రప్రథమంగా కాకినాడలో జరిగే ఈ ఆటో షోలో హీరో, హోండా, బజాజ్, యమహా, టీవీఎస్, సుజికి, వెస్పా తదితర ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆటోషో జరుగుతుందని నిర్వాహకులు జి.రమేష్, కె.విఠల్‌కుమార్, పి.రాము చెప్పారు. ఆయా కంపెనీలకు చెందిన మార్కెట్‌లో కొత్తగా వచ్చిన బైక్‌లు, స్కూటర్లు ఇక్కడ అందుబాటులో ఉంచుతామన్నారు. మహిళా సందర్శకులకు ఉచితంగా మెహందీని చేతికి పెడతామని, తమ కస్టమర్లకు ఉచితంగా ఇంజిన్‌ ఆయిల్‌ మార్పు చేస్తామని, ఉచితంగా పొల్యూషన్‌ను చెక్‌చేస్తామని చెప్పారు.

అవగాహన కార్యక్రమం
ఈ ఆటోషోలో విదర్భ ఆటో ఫైనాన్స్, పద్మపూజిత ఆటో ఫైనాన్స్‌ ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇక్కడ కేవలం 30 నిమిషాలలో వాహనాలకు 70 శాతం మేరకు ఫైనాన్స్‌ అందించనున్నారు.  రూ.50 వేల నుంచి రూ.3 లక్షల విలువైన వాహనాలకు ఫైనాన్స్‌ చేస్తామని చెప్పారు.

బహుమతుల పంట
మూడు రోజులపాటు జరిగే ఆటోషోలో వినియోగదారులకు పలు బహుమతులు అందజేస్తామన్నారు. ప్రతి వాహనం కొనుగోలుపై ఒక స్క్రాచ్‌కార్డు అందజేస్తామని, ఈ కార్డు ద్వారా రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు తక్షణ నగదు అందజేస్తామన్నారు.  బంపర్‌డ్రా ద్వారా కూడా కూడా నగదు బహుమతులు ఇస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement