గిన్నిస్‌ కేక్‌.. | Sachithananda Swamiji 75th birthday | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ కేక్‌..

May 27 2017 3:07 AM | Updated on Sep 5 2017 12:03 PM

గిన్నిస్‌ కేక్‌..

గిన్నిస్‌ కేక్‌..

మైసూరులోని దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ 75వ జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో గురువారం తెనాలికి చెందిన శశి ఆహార్‌ గ్రూపు

తెనాలి: మైసూరులోని దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ 75వ జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో గురువారం  తెనాలికి చెందిన శశి ఆహార్‌ గ్రూపు సంస్థలు ప్రత్యేకంగా తయారు చేసిన 1,500 కిలోల కేక్‌ను స్వామీజీ కట్‌ చేసి, భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. 120 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో 1,500 కిలోల బరువుతో రూపొందించిన ఈ కేక్‌పై ఎస్‌జీఎస్‌ అనే మూడు అక్షరాలను 8 అడుగల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో చేశారు.

రెండు నెమళ్ల బొమ్మలను కేక్‌కు ఇరువైపులా తీర్చిదిద్దారు. 108 పాదాలు, 108 దీపాలను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా వెజిటబుల్‌ పదార్థాలతోనే తయారు చేసినట్టు శశి ఆహార్‌ అధినేతలు ఉప్పల వరదరాజులు,  అనిల్‌కుమార్‌ శుక్రవారం సాయంత్రం శశి డెలీషియస్‌లో విలేకరులకు వెల్లడించారు. గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు వచ్చి కేక్‌ను చూసి రికార్డు నమోదు చేసుకున్నారని వరదరాజులు వివరించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement