breaking news
Ganapathi Sachachananda Swami
-
దీక్ష.. గురువు పెట్టిన పరీక్ష!
అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో ఉండే కష్టనష్టాలు గుర్తుకు రాకూడదు. గుర్తొస్తే పట్టుదల పలచబడి లక్ష్యం సాధించలేరు. ఏకాగ్రత ఉన్నప్పుడే లక్ష్య సాధన సాధ్యమవుతుంది.కారు నడిపే సమయంలో డ్రైవరు మనసు పరిపరివిధాల పోకుండా ముందు రోడ్డువైపే ఏకాగ్రతతో ఉంటుంది. లేకపోతే ప్రమాదాలేర్పడతాయి. అందుకే డ్రైవరు కారు వేగం పరిమి తిని, సమయాన్ని, ట్రాఫిక్ రూల్సును, సిగ్నల్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ముందుచూపు సడల కుండా దీక్షతో నడుపుతాడు. అప్పుడే వాహనం క్షేమంగా గమ్యం చేరుతుంది.ఒక శిల్పాచార్యుడికి ఇద్దరు శిష్యులుండేవారు. మొదటివాడు కష్టపడి చాలాసేపు శిల్పాలు చెక్కుతూనే ఉండే వాడు. రెండోవాడికెప్పుడూ ఆటల ధ్యాసే. గురువుగారు వచ్చేసరికి పని చేస్తూండటం, తర్వాత వదిలివేయటం అలవాటు. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఫలానా కొండల్లో ఫలానా రాయి ఉంది, వెతికి తీసుకురండని పంపాడు. ఇద్దరు అలాగే వెళ్ళి శిలను గుర్తించి తెచ్చారు. మొదటివాడు పండ్లు, పూలు, మూలికలు కూడా తెచ్చాడు.‘ఇవన్నీ ఎందుకురా?’ అని గురువడిగితే ‘స్వామీ! నా తల్లికి పండ్లు, చెల్లికి పూలు, మా అమ్మమ్మ చికిత్సకు మూలికలు తెచ్చా’నన్నాడు మొదటి శిష్యుడు. రెండవవాడిని ‘ఏరా! మీ తలిదండ్రులకు సుస్తీగా ఉందికదా! మరి నీవెందుకు మూలికలు తేలేదు’ అని గురువడిగాడు. ‘స్వామీ! నేను శిలను మాత్రమే వెతికాను. ఇతర ఆలోచనలేవీ నాకు లేవు’ అన్నాడు. పనిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉంటే కార్యసిద్ధి కల్గుతుంది.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
గిన్నిస్ కేక్..
తెనాలి: మైసూరులోని దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ 75వ జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో గురువారం తెనాలికి చెందిన శశి ఆహార్ గ్రూపు సంస్థలు ప్రత్యేకంగా తయారు చేసిన 1,500 కిలోల కేక్‌ను స్వామీజీ కట్ చేసి, భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. 120 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో 1,500 కిలోల బరువుతో రూపొందించిన ఈ కేక్‌పై ఎస్జీఎస్ అనే మూడు అక్షరాలను 8 అడుగల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో చేశారు. రెండు నెమళ్ల బొమ్మలను కేక్‌కు ఇరువైపులా తీర్చిదిద్దారు. 108 పాదాలు, 108 దీపాలను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా వెజిటబుల్ పదార్థాలతోనే తయారు చేసినట్టు శశి ఆహార్ అధినేతలు ఉప్పల వరదరాజులు, అనిల్‌కుమార్ శుక్రవారం సాయంత్రం శశి డెలీషియస్లో విలేకరులకు వెల్లడించారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వచ్చి కేక్‌ను చూసి రికార్డు నమోదు చేసుకున్నారని వరదరాజులు వివరించారు.


