సీఎం జగన్‌ను కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు

RTC Union Leaders Met AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కలిశారు. సచివాలయంలోని ముఖ్యమంత్రిని కలిసిన వారు ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై ముఖ‍్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఆయన ఆమోదం తెలపడంతో 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది.

చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం విదితమే.  దీంతో ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యే ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు ప్రజా రవాణా శాఖలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి.

చదవండి: ఆర్టీసీ విలీనం!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top