కేశినేని నిర్ణయం అభినందనీయం: ఆర్టీసీ ఈయూ | rtc eu praises on closing of kesineni travels | Sakshi
Sakshi News home page

కేశినేని నిర్ణయం అభినందనీయం: ఆర్టీసీ ఈయూ

Apr 8 2017 2:39 PM | Updated on Sep 5 2017 8:17 AM

కేశినేని ట్రావెల్స్‌ను నిలుపుదల చేస్తూ ఆ సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ ఈయూ అభినందించింది.

అమరావతి: కేశినేని ట్రావెల్స్‌ను నిలుపుదల చేస్తూ ఆ సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ ఈయూ అభినందించింది. రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్న ట్రావెల్స్‌ యాజమాన్యాలు కూడా ఇదే మాదిరి నిర్ణయాన్ని ప్రకటించాలని కోరింది.

అలా కాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చొరవ తీసుకొని అక్రమంగా నడుపుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆటకట్టించే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. మూతబడిన కేశినేని ట్రావెల్స్‌ బస్సులను ఆర్టీసీకి ఇచ్చేలా ప్రభుత్వం సహకరించాలని యూనియన్‌ నేతలు కె. పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తదితరులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement