భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో కోతకు గురైన రోడ్ల పునర్నిర్మాణం కోసం రూ 800 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో కోతకు గురైన రోడ్ల పునర్నిర్మాణం కోసం రూ 800 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు తెలిపారు. ఈ మూడు జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేయడానికి తర్వరలో కేంద్ర బృందం రానున్నట్లు చెప్పారు.
బుధవారం ఉదయం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి .. అనంతరం దేవస్థానం అతిధిగృహంలో మీడియాతో మాట్లాడారు. నాబార్డు, ఆర్డీఎఫ్, ఆర్‌ఏడీఎఫ్, సీఆర్‌ఎఫ్‌ల ద్వారా రూ.1500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కాగా, ప్రయాణీకుల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ నష్టం వచ్చినా శ్రీశైలం నుంచి బ్రహ్మగిరికి బస్సులు నడపాలని మంత్రి సిద్ధా.. ఆర్‌ఎం వెంకటేశ్వరరావును ఆదేశించారు.