అర్ధరాత్రి దోచేశారు.. | Robbey in Vizianagaram district | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి దోచేశారు..

May 24 2015 9:23 AM | Updated on Aug 30 2018 5:24 PM

విజయనగరం జిల్లాలోని బాబామెట్ట ప్రాంతంలో దొంగలు శనివారం రాత్రి భారీ చోరీలకు పాల్పడ్డారు.

విజయనగరం :  విజయనగరం జిల్లాలోని బాబామెట్ట ప్రాంతంలో దొంగలు శనివారం రాత్రి భారీ చోరీలకు పాల్పడ్డారు. స్థానికులైన  పి.రఘువర్మ, వెంకట పైడిరాజు ఇళ్ల కిటికీల గ్రిల్స్ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఇళ్లలో వారు నిద్రిస్తున్న గదులకు బయట గడియ పెట్టి విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయారు. రఘువర్మ ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు, పైడిరాజు ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండిని తస్కరించారు. అదే విధంగా రఘువర్మ ఇంట్లోనే వేరొక పోర్షన్‌లో ఉండే కార్తీక్ ఇంట్లోకి చొరబడి రూ.4 వేల నగదును దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఆదివారం ఉదయం టూటౌన్ పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement