శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.
పొదలకూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. స్థానిక మారుతీనగర్‌లో ఉండే వెంకట నారాయణ, ఆయన భార్య మహ్మదాపురం పీహెచ్‌సీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం దంపతులు విధులకు వెళ్లగా, వారి కుమార్తె స్కూలుకు వెళ్లింది. తిరిగి సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన వారి కుమార్తె ఇంట్లో బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించింది.
ఆభరణాలు పోయినట్లు గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు వచ్చి సుమారు 10 సవర్ల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై అహ్మద్‌బాషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మారు తాళంతో తలుపులు తెరిచి, చోరీ అనంతరం తిరిగి తాళం వేశారని సమాచారం.