పెద్దాపురంలో భారీ చోరీ | Robbery in Peddapuram | Sakshi
Sakshi News home page

పెద్దాపురంలో భారీ చోరీ

Dec 6 2015 8:02 AM | Updated on Aug 30 2018 5:27 PM

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో భారీ దోపిడీ జరిగింది. స్థానిక వంకాయలవారి వీధిలో నివాసముంటున్న భారత్ గ్యాస్ డీలర్ మందవెల్లి శ్రీనివాసరావు ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు.

పెద్దాపురం (తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో భారీ దోపిడీ జరిగింది. స్థానిక వంకాయలవారి వీధిలో నివాసముంటున్న భారత్ గ్యాస్ డీలర్ మందవెల్లి శ్రీనివాసరావు ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఇంట్లో ఉన్న 3 కిలోల బంగారం, భారీగా వెండి సామాగ్రి, కొన్ని వజ్రాలను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ. కోటిన్నర వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement