పొరుగూరికి పెళ్లికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు.
పెళ్లికి వెళ్లొచ్చేసరికి..
Nov 28 2015 9:25 AM | Updated on Aug 30 2018 5:27 PM
మాచర్ల: పొరుగూరికి పెళ్లికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. సిరిగిరిపాడు గ్రామానికి చెందిన కొండయ్య రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి పెళ్లికి వెళ్లాడు. ఇదే అదునుగా చేసుకున్న దొంగలు కొండయ్య ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.40 వేల నగదు, 10 సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. శనివారం తెల్లవారుజాము ఇంటికి చేరుకున్న బాధితులు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement