నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఓ మినీ ట్రక్ కల్వర్ట్‌ను ఢీకొంది.
దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఓ మినీ ట్రక్ కల్వర్ట్‌ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, వాహన యజమాని తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. మృతుడ్ని వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన ఇల్లూరి శ్రీనివాసులగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఎన్. సుబ్బరాయుడిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.