తృటిలో తప్పించుకున్న ఆర్‌కే!

Rk escape in firing - Sakshi

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఎదురుకాల్పులు

మల్కన్‌గిరి/సీలేరు (విశాఖ ఏజెన్సీ): ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి జోడాంబు పంచాయతీ పరిధిలోని సిమిలిపోదర్‌ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే తృటిలో తప్పించుకు న్నారు. ఉదయం 9 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఆర్‌కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పరారయ్యారని చెప్పారు. పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా డీజీపీ ఆర్‌పీ శర్మ మాట్లాడుతూ మావోయిస్టుల అణచివేతకు ఛత్తీస్‌ గఢ్, ఆంధ్ర పోలీసులతో కలిసి ఒడిశా పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు.  2016లో రాయగఢ్‌ ప్రాంతంలో 34 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారని తెలిపారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌–ఒడిశా సరిహద్దు ల్లో భారీ ఎన్‌కౌంటర్‌లు జరిపి 38 మంది మావోయిస్టులను హతమార్చా మని తెలిపారు. మావోయి జాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ మావోయిస్టులకు పిలుపునిచ్చారని తెలిపారు. అందుకోసమే ఆపరేషన్‌ ఆలౌట్‌ను మల్కన్‌గిరి జిల్లా నుంచి ప్రారంభించామని స్పష్టం చేశారు. దీనికోసం గురువారం హెలికాప్టర్లతో సర్వే కూడా చేయించామన్నారు.  మల్కన్‌గిరిలో క్యాంప్‌లను నిర్వహిస్తామని చెప్పారు. కాగా  ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top