నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో కుర్రంపల్లి శివారులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది.
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Dec 28 2015 11:34 AM | Updated on Nov 6 2018 5:21 PM
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో కుర్రంపల్లి శివారులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు, అటవీ అధికారులు పక్కా సమాచారం మేరకు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఆటోలో తరలిస్తున్న 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement