చిత్తూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం | Red sanders wood seized at bakarapet | Sakshi
Sakshi News home page

చిత్తూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం

Sep 15 2013 10:59 AM | Updated on May 10 2018 12:34 PM

బాకారాపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనాన్ని అటవీ శాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలోని బాకారాపేట అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎత్తున అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనాన్ని అటవీ శాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఎర్రచందనం విలువు రూ. 30 లక్షల వరకు ఉంటుందని అటవీశాక అధికారులు తెలిపారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement