కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. పోటీలో రెబల్ అభ్యర్థులు లేకుండా చూసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఏఐసీసీ పరీశీలకులు హైదరబాద్ వచ్చారు. రామచంద్రయ్య కుంతియా, తిరునావక్కరుసు ఇక్కడ ఏఐసీసీ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ ప్రతినిధులను కలవనున్నారు.
ఇదిలా ఉండగా, పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. రాజ్యసభకు పోటీ చేసే విషయంమై చర్చించేందుకు ఆయన సిఎంను కలిసినట్లు తెలుస్తోంది.