కొత్త రూ. 100 నోట్లు వచ్చాయోచ్‌..

RBI Releases New Hundred Rupees Notes - Sakshi

విశాఖపట్నం, పరవాడ(పెందుర్తి): రిజర్వు బ్యాంకు ఈనెల 1 న మార్కెట్‌లోకి విడుదల చేసిన రూ.100 నోట్లను పరవాడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధర్‌ సేకరించారు. ఈ నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ, వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘రాణికి వావ్‌’ ముద్రించి ఉంది. లావెండర్‌ కలర్‌లో ముద్రించిన కొత్త వంద నోటు 142 మిల్లిమీటర్ల పొడవు, 66 మిల్లీ మీటర్ల వెడల్పు ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ, అశోకుడి నాలుగు సింహాలు, 100 సంఖ్య వాటర్‌ మార్కు ఉన్నాయి. నోటు వెనుక భాగంలో స్వచ్ఛభారత్‌ లోగో నినాదం ఉంది. పాత వంద నోట్లతో పాటు కొత్త నోట్లు చలామణిలో ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top