వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.
వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. ఒక బృందంగా ఏర్పడిఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, జాతీయ పార్టీల నేతలను కలిసి సీమ సమస్యలను వివరించాలని నిర్ణయించారు. రాయలసీమ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో గురువారం హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్. చంద్రశేఖరరెడ్డి, రాయలసీయ పీపుల్స్ ఫోరం నేతలు వై. నాగిరెడ్డి, ఎస్. రమణయ్య, జి. హరిప్రసాద్, సేవ్ రాయలసీమ కన్వీనర్ కె. శాంతారెడ్డి, సీమ జేఏసీ కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి సీమ డెవలప్‌మెంట్ ఫోరంను ఏర్పాటుచేశారు. తమ ప్రాంత ప్రజాప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. సమావేశానంతరం మంత్రి రామచంద్రయ్యతో కలిసి ఫోరం ప్రతినిధులు సీహెచ్. చంద్రశేఖరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తరువాత రాయలసీమలో ఉత్పన్నమయ్యే తాగునీటి ఇబ్బందులను, ఈప్రాంత వెనుకబాటుతనంపై సమావేశంలో చర్చించినట్టు చంద్రశేఖరరెడ్డి తెలిపారు.