మత్స్యవాని పేటలో యువతిపై అత్యాచారయత్నం | Rape attempt on woman in Visakhapatnam district | Sakshi
Sakshi News home page

మత్స్యవాని పేటలో యువతిపై అత్యాచారయత్నం

Dec 24 2014 8:46 AM | Updated on Jul 28 2018 8:51 PM

విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం మత్స్యవానిపేటలో మంగళవారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం మత్స్యవానిపేటలో మంగళవారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో యువకుడి బారీ నుంచి తప్పించుకున్న యువతి ఇంటికి చేరుకుని... జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.

దాంతో వారు కొత్తకోట పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని బుధవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్కు తరలించి...తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement