భారత తీరప్రాంత రక్షణ దళంలోకి మరో నౌక

Rani Roshmoni Ship entered in Indian Coast Guard - Sakshi

సాక్షి, వైజాగ్: భారత తీర ప్రాంత రక్షణ దళంలోకి మరో గస్తీ నౌక చేరింది. రాణి రోష్మణి నౌకను కోస్ట్‌గార్డు అదనపు డీజీ వీఎస్‌ఆర్ మూర్తి జాతికి అంకితం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 51 మీటర్ల పొడవైన ఈ నౌకను విశాఖ హిందూస్థాన్ షిప్‌యార్డు తయారు చేసింది.  రాణి రోహ్మణి ధైర్యసాహసాలు గుర్తు చేసుకుంటూ నౌకకు నామకరణం చేశారు.

ఈ నౌకను నిర్మించడం షిప్‌యార్డు ఘనతల్లో ఒకటని హిందూస్థాన్ షిప్‌యార్డు సీఎండీ తెలిపారు. 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించడానికి చాలా ప్రయోగాలు చేశామని పేర్కొన్నారు. సాంకేతికంగా చాలా ఆధునికంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు తీర ప్రాంత రక్షణ దళం అవసరాలకు అనుగుణంగా నౌకల తయారీకి షిప్‌యార్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top