breaking news
Indian Coast Guard Ship
-
భారత తీరప్రాంత రక్షణ దళంలోకి మరో నౌక
సాక్షి, వైజాగ్: భారత తీర ప్రాంత రక్షణ దళంలోకి మరో గస్తీ నౌక చేరింది. రాణి రోష్మణి నౌకను కోస్ట్‌గార్డు అదనపు డీజీ వీఎస్ఆర్ మూర్తి జాతికి అంకితం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 51 మీటర్ల పొడవైన ఈ నౌకను విశాఖ హిందూస్థాన్ షిప్‌యార్డు తయారు చేసింది. రాణి రోహ్మణి ధైర్యసాహసాలు గుర్తు చేసుకుంటూ నౌకకు నామకరణం చేశారు. ఈ నౌకను నిర్మించడం షిప్‌యార్డు ఘనతల్లో ఒకటని హిందూస్థాన్ షిప్‌యార్డు సీఎండీ తెలిపారు. 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించడానికి చాలా ప్రయోగాలు చేశామని పేర్కొన్నారు. సాంకేతికంగా చాలా ఆధునికంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు తీర ప్రాంత రక్షణ దళం అవసరాలకు అనుగుణంగా నౌకల తయారీకి షిప్‌యార్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. -
డ్రగ్స్ కలకలం: రూ.3500 కోట్ల హెరాయిన్ సీజ్
న్యూఢిల్లీ: భారత నావికా దళం భారీ డ్రగ్స్ రాకెట్ ఆట కట్టించింది. గుజరాత్ తీరంలో ఓ వ్యాపారికి చెందిన దాదాపు 1500 కిలోగ్రాముల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అర్థరాత్రి ఓడలో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా గుర్తించిన అధికారులు దాడి చేసి డ్రగ్స్ ను సీజ్ చేశారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ దాదాపు రూ. 3500 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ సీజ్ చేసిన డ్రగ్స్ కేసుల్లో ఇదే అతిపెద్దదని అధికారులు తెలిపారు. నిఘా అధికారుల సమాచారం మేరకు భారత నావికా దళం డ్రగ్స్ ముఠాపై ఆకస్మిక దాడి ఒకటిన్నర టన్నుల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఓడలో తీసుకెళ్తున్న మాదకద్రవ్యాలు భారీ స్థాయిలో ఉండటంతో అధికారులు అశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం నావికాదళం, నిఘా, పోలీసు, కస్టమ్స్ విభాగాల అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్ రవాణాపై విచారణ చేపట్టారు. ఎంత మందిని అరెస్ట్ చేశారు, వారి వివరాలు తెలియాల్సి ఉంది.