పవన్ 'ఇజమ్' రాసిన వారికైనా అర్ధమవుతుందా?
'పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప నాయకుడు', 'జన సేన అనే పేరు శివసేన కంటే వెయిరెట్లు మెరుగు' అంటూ ట్విటర్ లో పవర్ స్టార్ ను ఆకాశానికెత్తేసిన రాంగోపాల్ వర్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
'పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప నాయకుడు', 'జన సేన అనే పేరు శివసేన కంటే వెయిరెట్లు మెరుగు' అంటూ ట్విటర్ లో పవర్ స్టార్ ను ఆకాశానికెత్తేసిన రాంగోపాల్ వర్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేన సిద్దాంతాలను విశాఖ సభలో 'ఇజమ్' పేరుతో పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే 'ఇజమ్' పుస్తకంపై వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకం కనీసం రాసిన వారికైనా అర్ధమవుతుందా అని సందేహం వ్యక్తం చేశారు.
'ఇటీవలే 'ఇజమ్' పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అనేక సందేహాలు రేకెత్తాయి. 'ఇజమ్' పుస్తకం రాసిన రచయితలకైనా అర్ధమవుతుందా అనే అనుమానం వచ్చింది' అని తాజాగా వర్మ ట్వీట్ చేశారు. అందరికీ అర్ధమయ్యే సులభమైన భాషలో 'ఇజమ్' పుస్తకం పవన్ కళ్యాణ్ తీసుకువస్తారని అనుకుంటున్నాను అని వర్మ ట్విటర్ లో పోస్ట్ చేసిన ఓ సందేశంలో పేర్కోన్నారు.
విశాఖపట్నం సభ తర్వాత పవన్ పై వర్మ పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలిగిపోయాని తాజా ట్వీట్ తో అర్ధమవుతోంది. విశాఖలో పవన్ ప్రసంగం విన్న తర్వాత ఏం చేయాలో ఆయనకే క్లారిటీ లేదని పలువర్గాల నుంచి విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే.