జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి వర్మ

Ram Gopal Varma Attend YS Jagan Swearing-in Ceremony - Sakshi

సాక్షి, విజయవాడ: తన జీవితంలో మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైఎస్సార్‌సీపీకి ప్రజలు కట్టం కట్టారని అన్నారు.

వైఎస్‌ జగన్‌ చారిత్రాక విజయం సాధించారని ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి కారణమన్నారు. వైఎస్‌ జగన్‌ మాటల్లోని నిజాయితీ ప్రజలకు కనెక్ట్‌ అయిందన్నారు. ఆయనపై ప్రజలు ఎంతో నమ్మ‍కం పెట్టుకుని అఖండ​ విజయంతో గెలిపించారని వివరించారు. వైఎస్‌ జగన్‌ మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకాన్ని రాంగోపాల్‌ వర్మ వ్యక్తం చేశారు. (చదవండి: అఖండ విజయం మిరాకిల్‌: అలీ)

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top