మున్సిపాలిటీలపై నమ్మకం కలిగించండి | Raise hopes on municipality | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలపై నమ్మకం కలిగించండి

Nov 8 2013 4:04 AM | Updated on Sep 2 2017 12:23 AM

ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించి ప్రజలకు మున్సిపాలిటీలపై నమ్మకాన్ని కలిగించాలని మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి కమిషనర్లను ఆదేశించారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించి ప్రజలకు మున్సిపాలిటీలపై నమ్మకాన్ని కలిగించాలని మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి కమిషనర్లను ఆదేశించారు. గురువారం మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవలను సకాలంలో అం దించకపోవడంతో పాటు, సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికే ము న్సిపాలిటీలపై ప్రజలకు నమ్మకం పో యిందన్నారు.
 
 
 పేదల బాగు కోసం ఏ పథకాన్ని ప్రారంభించినా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమర్థవంతంగా అ మలు చేయలేకపోతున్నామన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన సిటిజన్ సర్వీస్‌ను కూ డా పక్కనబెడితే ఎలా అని, మీకెలా చె ప్పాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదని మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పాలనపరంగా ఎన్ని మం చి పథకాలు ప్రవేశపెట్టినా, అమలు చేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుం దన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి, గుంతకల్ ము న్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని రాణిం చాలని సూచించారు. 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వాడకంపై దాడు లు నిర్వహించి, వారం రోజుల్లో పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
 
 
 ఇదివరకే వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టగా, చాలావరకు ప్ర జల్లో చైతన్యం వచ్చిందని గుర్తు చేశారు. ఇక వెంటనే వాటిని విక్రయించే వారిపై దాడులు కొనసాగించి కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశించారు. పారిశుధ్య పనుల్లో మహిళలను భాగస్వామ్యం చేసి పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. మహిళాసంఘాలను బలోపే తం చేసేలా వారికి అన్ని వసతులు కల్పిం చాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరయ్య, మెప్మా పీడీ పద్మహర్ష, ఇతర కమిషనర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement